Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

..Welcome to My Blog... Vamsi

Amazon Shop

అహం


🕉🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
ఆహారము,నిద్ర,మైధునం, భయం యివి ప్రతి ప్రాణికి
ఉండే సహజ లక్షణాలు.
పశు,పక్ష్యాదులలో వీటిని
పొందుటలో కాని,అనుభ
వించుటలో కాని భయానికి
చోటు లేదు.ఆహారం,రుచికి
ప్రాముఖ్యత లేకుండా ఆకలి అయినప్పుడు ప్రకృతి యిచ్చినది ఆరగించి తృప్తి పడతాయి.
నిద్ర కూడా అంతే!పరుపు
లు,ACలు అవసరం లేదు.
లైంగిక కోరికలు ఋతువు
లకు అనుగుణంగా (Seasonal) ఉంటవి కనుక (మనుషుల్లో 24hr)
మైధున యిబ్బంది లేదు.
వీటికి భయమల్లా మరణం
గురించి కాదు.తనకన్నా
భిన్నమైన వైరి వర్గ జంతు
వును ఎదుర్కొనే క్రమంలో
పారిపోయే ప్రయత్నం
సహజంగా చేస్తుంది.దాని
నే భయంగా అనుకుంటా
ము . మనుషులకు తిన
టానికి భయం.నిద్ర లో కూడా  భయం.మనిషి
అనగా మని + షి అని ఒకరు విశ్లేషించారు.
నాలుగవది మన చర్చలో
ఉన్న "భయం" .మొదటి
మూడు బతుకు భయం అవుతే,ఈ నాలుగవది
మరణ భయం."జాతస్య
హి ధృవో మృత్యుః " అని
అందరూ వల్లె వేస్తారు.
ఇది కేవలం పుస్తకాలకే
పరితమైలేదు.మనకు
ప్రత్యక్ష నిదర్శనం కూడా.
అయినప్పటికి మనుషుల
భయం కేవలం మరణిస్తా
ను అనేనా లేక యింతకు
మించిన కారణం మరేదైనా
ఉన్నదా?
అసలు భయం అంటేనే
మృత్యువు.మరణ భయం
పక్కన పెడితే బ్రతుకు భయం కారణంగా అను
క్షణం మనం చస్తూ,పుడు
తూ ఉన్నాము.విశేషమైన
తెలివితేటలు లేని పసు,
పక్ష్యాదులు హాయిగా
జీవిస్తున్నాయి.అద్భుత
మైన తెలివి,వాక్కు,విచక్షణ
జ్ఙానం కలిగిన మనం జీవి
తాన్ని అతి దీనంగా దుర్భ
రంగా జీవిస్తున్నాము.దీని
కి కారణం ఏమిటి? పరిష్కా
ర మేమిటి ?
ఒక వృద్ధాప్యంలో ఉన్న
వ్యక్తికి తరగనంత సంపద,
తన బాగోగులు చూసుకునే
బంధువులు ఉన్నారు.కాని
శరీరంమాత్రం శిథిలమై ఏ
మాత్రం సహకరించుట లేదు. ఒక రాత్రి స్వప్నంలో
దైవ దర్శనమైంది.చావుకు
సిద్ధంకమ్మని చెప్పాడు.ఈ
మనిషి ,తన ముని మను
మడి వివాహం వరకు ఆగ
మనివేడుకున్నాడు.ఆయన
ఈ విధంగా అనుగ్రహించా
డట.నీ శరీరానికే మరణం.
ఈ శరీరం బదులు ఆరోగ్య
మైన శరీరం యిస్తాను.ఇదే
జీవితాన్ని యధాతధంగా
కొనసాగించు అని సెలవి
చ్చాడు.ఈ మనిషి అమితా
నందంతో ,స్వామీ! నాకు
మరణం తక్షణం ప్రసాదిం
చండి అని కోరాడు.
యిప్పుడు మనిషికి ఉన్నది
చావు భయమా లేక తను సంపాదించిన ఆస్థి,పాస్తు
లు,తన వారి శాశ్వత ఎడ
బాటా?లోతుగా విశ్లేషిస్తే
రెండవదే నిజమని తెలు
స్తుంది.
నేను,నాది అనే భ్రమలో
ఉన్నంతవరకు జనన, మరణ చక్రాన్నుండి ముక్తి
లేదు. అది పొందటమే
సాధకుల లక్ష్యం కావాలి .

🕉🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

No comments: